మనసు లో మాట
కెంబాయి వెంకట
తిమ్మాజీ రావు కీ.శే.కెంబాయి
వెంకట రమణమ్మ
02.11.1938 to 22.03.2013
ఋణాను బంధ రూపేణా పత్నీపుత్ర ... అనేది ఆర్యోక్తి. ఏ జన్మ బంధమో, ఏ
ఋణాను బంధమో, అవన్నీ ఈ
జన్మలో ఎంత వరకు నిజమో ఎవరికీ తెలియదు అయినా
అంతటి ఙ్ఞానమూ
ఏ మానవుడి కి ఉండదు. కంటికి కనిపించని దేవుళ్ళు, దేవతలు, ఎంతమంది
ఉన్నా, ఎంతటి
మోక్ష ప్రదాతలైనా, ఆ దైవ
ఋణాలన్నీఏదో రకంగా తీర్చుకోవచ్చు. దుర్లభమైన మానవ జన్మ లభించడమే ఒక వరమైతే, ఆ
జన్మ ఇచ్చిన తల్లి దండ్రులు కడు పూజనీయులు.
ప్రత్యక్ష దైవాలైన ఆ తల్లి
దండ్రులు ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. ఎందుకంటే ప్రతి జన్మ లోనూ
తల్లి దండ్రి లేనిదే మనం లేము కనుక. ఎంతో చేసినా, ఇంకా ఏదో చేయాలని ఇప్పటికీ తపన
చెందే మా నాన్నగారు కెంబాయి వెంకట తిమ్మాజీ రావు గారు.
మా అమ్మ, కెంబాయి వెంకట రమణమ్మ, భౌతికంగా మా మధ్య లేక పోయినా, నాకు (మాకు) జన్మనిచ్చి, సంస్కారయుతమైన జీవితాన్నిచ్చి, ప్రేమ
పంచి, ఎప్పుడూ ఙ్ఞాపకాలలో మావెంటే
ఉంటూ, మమ్ముల
సరియైన మార్గం లో నడిపించే మా అమ్మగారి ఙ్ఞాపకార్థం, ఈ చిన్న
పొత్తం.
అందరికీ పనికి వస్తుందన్న ఆశతో ..
కెంబాయి శ్రీనివాస రావు
కెంబాయి ఉమా రాణి (కోడుగంటి ఉమా రాణి)
కెంబాయి రామారావు,
కెంబాయి శశికుమారి (ఫీల్ఖాన శశికుమారి)
సహకరించినవారు : కాండ్రేగుల జ్యోతి జోగారావు గారు (బావ గారు)
కాండ్రేగుల రాధ (కెంబాయి సరస్వతి)
యడవల్లి ఆనంద రావు గారు (బావ గారు)
యడవల్లి రమా దేవి (కెంబాయి రమా దేవి)
పెమ్మరాజు క్రిష్ణ కుమార్ గారు (బావ గారు)
పెమ్మరాజు గాయత్రి (కెంబాయి గాయత్రి)